భూమి తిరుగుతున్నా మనకు ఎందుకు కదులుతున్నట్లు అనిపించదు

ఈ విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.

ఇవి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. 

భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది.

సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. 

భూమి సూర్యుడి చుట్టూ గంటకు 1,07,280 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. 

భూమి తన చుట్టూ తాను గంటకు 1,666 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. 

ఇంత వేగంతో తిరగుతున్నా, మనకి ఎందుకు అసలు కదులుతున్నట్లు అనిపించదు. 

నిజానికి స్థిరమైన వేగంతో భూమి తిరుగుతుండడం వల్ల కదులుతున్నట్లు మనకి అనిపించదు. 

ఇక భూమి తిరుగుతున్నట్లు అనిపించక పోడానికి గురుత్వాకర్షణ శక్తి కూడా కారణం. 

భూమి తిరిగేటప్పుడు సెంట్రిఫుగల్ ఫోర్స్ ఉత్పన్నమవుతుంది.

అయితే భూమి గురుత్వాకరణ శక్తి ఆ సెంట్రిఫుగల్ ఫోర్స్ కంటే చాలా బలంగా ఉంటుంది. 

అందుకే మనం గ్రహానికి అతుక్కుని ఉంటాం.