ప్రపంచంలో ఉన్న పులులు ఎన్నో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా 4,989 పులులు మాత్రమే ఉన్నాయి. వాటిలో సగానికి పైగా భారత్‌లోనే ఉన్నాయి. ఏ దేశంలో ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం.
ప్రపంచంలో ఎక్కువ పులులు ఉన్నది భారత్ లోనే. మొత్తం 2,967 ఉన్నాయి. భారత జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్.
భారత్ తర్వాత రష్యాలో 540 పులులు ఉండగా.. ఇండొనేసియాలో 500 ఉన్నాయి.
నేపాల్‌లో 355 పులులు ఉండగా.. థాయిలాండ్‌లో 189, మలేసియాలో 150 ఉన్నాయి.
బెంగాల్‌కి పక్కనే ఉండే బంగ్లాదేశ్‌లో 106, భూటాన్‌లో 103 పులులు ఉన్నాయి.
భూభాగంలో ఇండియా కంటే 2 రెట్లు పెద్దదైన చైనాలో పులులు 50 మాత్రమే ఉన్నాయి.
మయన్మార్‌లో 22, వియత్నాంలో 5, లావోస్‌లో 2 పులులు ఉన్నాయి.
ఇలా ప్రపంచంలో పులులు కలిగిన దేశాలు 12 మాత్రమే ఉన్నాయి.
1900 కాలంలో ఇండియాలో 30వేల దాకా పులులు ఉండేవి.
1972లో ఇండియాలో పులుల సంఖ్యను లెక్కించగా 1,800గా తేలింది.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పులుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
More
Stories
మీరు పడుకునే విధానాన్ని బట్టీ మీ పర్సనాల్టీ ఇదీ..!
ఈ రాశుల వారికి అహంకారం. గొప్పలు చెప్పుకుంటారు
ఆలూ చిట్కా