దీరాధనలో వత్తులను బట్టి ఫలితాలుంటాయా?
హిందువుల్లో దాదాపు అందరు ఇంట్లో ప్రతి రోజూ దేవుడి దగ్గర దీపాలు పెడతారు.
దీపం పెట్టడానికి ఉపయోగించే పత్తిని పట్టి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
దీపారాధనకు శుద్ధమైన వత్తిని ఎంచుకోవాలి. పత్తితో చేసిన వత్తులు సర్వశ్రేష్టమైనవి. అన్నివేళల్లోనూ పత్తివత్తులను ఎవరైనా వెలిగించవచ్చు.
తామరతూడులతో వత్తులు చేసి వెలిగిస్తే అఖండభాగ్యం లభిస్తుంది. పితృదోషాలు తొలగుతాయి.
అరటివత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి. జిల్లేడు వత్తులతో వెలిగిస్తే అపారసంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగుతుంది.
నూతన వస్త్ర పీలికను కుంకుమనీళ్లలో తడిపి, ఆరబెట్టి దీపారాధన చేస్తే కుజ, శుక్రదోషాలు పోతాయి.
పసుపురంగు వస్త్రంతో వత్తిచేసి వెలిగిస్తే దేవీ కటాక్షం సిద్ధిస్తుంది.
కుంకుమరంగు వస్త్రంతో చేసిన వత్తితో వెలిగిస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.
ఎర్రరంగు వస్త్రాన్ని గంధపునీటిలో తడిపి, ఆరబెట్టి దీపారాధన చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది.
పన్నీరుతో తడిపిన నేతివత్తులతో వెలిగిస్తే కీర్తివంతులవుతారు.
తామరనారతో దీపారాధన చేస్తే గ్రహదోషాలు పోతాయి.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు