అన్నం పూర్తిగా మానేస్తే బరువు తగ్గుతారా..?

భారతీయ ఆహారంలో అన్నం ప్రధాన భోజనం. 

కొన్ని చోట్ల అన్నం మాత్రమే తింటారు. దక్షిణ భారతదేశంలో బియ్యం ఎక్కువగా వినియోగిస్తారు.

అయితే మనలో చాలా మంది అన్నం మానేస్తే బరువు తగ్గుతారని భావిస్తారు.

అయితే, వైద్య నిపుణుల వాదన మరోలా ఉంది.

అన్నం తినడం పూర్తిగా మానేస్తే బరువు తగ్గుతారన్నది కేవలం అపోహ అంటున్నారు.

అన్నంలో మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు, పిండి పదార్థాలు ఉంటాయి.

ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి.

కాబట్టి బరువు తగ్గడం కోసం అన్నం మానేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

బరువు తగ్గాలనుకునేవారు నిదానంగా ఫోకస్ చేసి ఇతర పద్దతులు పాటిస్తే మంచిది.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.