గిల్.. జిగేల్

ఈ ఏడాది శుబ్ మన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.

పరుగుల వరద పారిస్తున్నాడు.

ఐపీఎల్ ముందు వరకు సెంచరీలతో కదం తొక్కాడు.

అయితే ఐపీఎల్ తర్వాత పరుగుల కోసం కాస్త ఇబ్బంది పడ్డాడు.

ఆసియా కప్ 2023 ద్వారా మళ్లీ టచ్ లోకి వచ్చాడు.

ప్రపంచకప్ ముందు గిల్ ఫామ్ లోకి రావడం శుభ పరిణామం.

గిల్ ఈ ఏడాది వన్డేల్లో 18 ఇన్నింగ్స్ ల్లో 1,052 పరుగులు చేశాడు.

సగటు 68.33 కాగా.. స్ట్రయిక్ రేట్ 103.32గా ఉంది.

5 సెంచరీలు ఉన్నాయి.

ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం.

వన్డే ప్రపంచకప్ లో గిల్.. జిగేల్ ఆటతో అలరించేందుకు రెడీ అయ్యాడు