లివర్ ఆరోగ్యం కోసం 10 బెస్ట్ ఫుడ్స్..

ఆకు కూరలు : బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకు కూరల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలోని మలినాలను క్లీన్ చేయడంలో సహాయపడతాయి.

చేపలు : సాల్మన్, మాకేరెల్, సార్డినెస్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి, ఇవి కాలేయ కొవ్వు, వాపును తగ్గిస్తాయి.

ఆలివ్ ఆయిల్ : ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌లో హెల్తీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాలేయ పనితీరుకు తోడ్పడతాయి.

గింజలు : బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి కాలేయ ఆరోగ్యాన్ని పెంపోందిస్తాయి..

బెర్రీలు : బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి కాలేయం దెబ్బతినకుండా కాపాడతాయి.

వెల్లుల్లి : కాలేయ ఎంజైమ్‌లను ఆక్టివేట్ చేయడానికి, శరీరం నుండి విషాన్ని బయటకు పంపడానికి తొడ్పాటు అందిస్తాయి.

పసుపు : పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంది, ఇది కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి.

గ్రీన్ టీ : కాటెచిన్‌లను కలిగి ఉంటుంది, ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది, అంతేకాదు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది.

సిట్రస్ ఫ్రూట్స్ : నిమ్మకాయలు, నారింజలు, ద్రాక్షపండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి కాలేయాన్ని క్లీన్ చేయడంలో తోడ్పడతాయి.

బీట్‌రూట్ : బీటైన్‌ను కలిగి ఉంటుంది, ఇది కాలేయాన్ని కాపాడడంలోను, కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.