ఆండ్రాయిడ్ మొబైల్ పోయిందా.. ఇలా కనిపెట్టండి
మీ మొబైల్ పోతే, టెన్షన్ అక్కర్లేదు. గూగుల్ ఫైండ్ మై డివైజ్ సర్వీస్ ద్వారా కనిపెట్టవచ్చు.
Find My Device మీ ఫోన్ కనిపెట్టగలదు లేదా లాక్ చెయ్యగలదు లేదా డేటాను చెరిపెయ్యగలదు.
మీ మొబైల్లో మీరు గూగుల్ అకౌంట్ కలిగివుంటే, ఈ సర్వీసులు మీకు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి.
ఇందుకోసం మీరు ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి, android.com/findకి వెళ్లాలి.
ఇప్పుడు మీరు గూగుల్ అకౌంట్లో సైన్ ఇన్ అవ్వాలి.
మీరు ఒకటి కంటే ఎక్కువ మొబైల్స్ కలిగివుంటే, సైడ్ బార్లో పోయిన మొబైల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
పోయిన మొబైల్లో ఎక్కువ గూగుల్ అకౌంట్లు కలిగివుంటే, ప్రధాన అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వాలి.
ఆ తర్వాత మీ మొబైల్ ఎక్కడ ఉందో మీకు మ్యాప్‌లో చూపిస్తుంది.
మీ మొబైల్ ఎక్కడుందో చెప్పలేకపోతే, కనీసం చివరిసారిగా అది ఎక్కడుందో లొకేషన్ చూపించే ఛాన్స్ ఉంటుంది.
వ్యక్తిగత మొబైల్స్‌కి మాత్రమే Find My Device సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
మొబైల్ లొకేషన్ కూడా పూర్తిగా కచ్చితత్వంతో ఉండకపోవచ్చు. దరిదాపుల్లో చూపిస్తుంది.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం