కళ్లలోకి చూస్తూ, ఎదుటి వారి రహస్యాలు తెలుసుకోండి!
శరీరం యొక్క అత్యంత ఆకర్షణీయమైన భాగం కళ్ళు. మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కళ్లు లేదా నోటిని చూసి మాట్లాడతాం.
మనం కాన్ఫిడెన్స్‌తో మాట్లాడేటప్పుడు, కళ్లలోకి చూసి మాట్లాడతాం. కళ్లను చూస్తూ వ్యక్తికి సంబంధించిన అనేక రహస్యాలు తెలుసుకోవచ్చు.
నిజానికి కళ్ల భాష అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ మీరు కంటి రకం, రంగు నుంచి అనేక ఆలోచనలను ఊహించవచ్చు.
కంటి రంగు నల్లగా, అందంగా ఉంటే, వారి జీవితంలో సంతోషం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారికి కెరీర్ సక్సెస్ అవకాశాలు కూడా ఎక్కువే.
ఎరుపు కళ్ళు ఉన్నవారు చెడు ఘటనలను ఎదుర్కొంటారు. కానీ వారు దేన్నైనా బలంగా ఎదుర్కోగలుగుతారు. త్వరగా నిర్ణయం తీసుకుంటారు.
గుండ్రని కళ్ళు ఉన్నవారు తమ ప్రయోజనాల కోసం ప్రతిదీ చేయగలరు. వీరు సాధారణంగా ఇతరుల మంచి, చెడుల గురించి ఆలోచించరు.
సాపేక్షంగా పెద్ద కళ్ళు ఉన్నవారు దయగలవారు. జీవితంలో ఎక్కువ భాగం ఆనందంగా గడుపుతారు. మంచి స్నేహితులను కలిగి ఉంటారు.
బ్రౌన్ ఐ కలర్ ఉన్నవారు ఇట్టే మోసం చెయ్యగలరు. వీరు అబద్ధం చెబితే, నమ్మకుండా ఉండటం కష్టం. తమ మాటలతో అందరినీ తమవైపు తిప్పుకోగలరు.
చిన్న కళ్ళు ఉన్నవారు ప్రతిభావంతులు. క్లిష్ట పరిస్థితుల్లోనూ తన మనసును దృఢంగా ఉంచుకుంటారు. ఏ సమస్య వచ్చినా దాన్ని అధిగమించి విజయం సాధిస్తారు.
కొంత మంది కళ్ళు లోపలికి లోతుగా ఉంటాయి. వారు ఆలోచనాపరులు. ఐతే.. కొన్నిసార్లు వీరి ఆలోచనలను, అనుమానాస్పద ధోరణిగా ఇతరులు భావించే ప్రమాదం ఉంటుంది.
Disclaimer: ఈ కథనం నివేదికలు, ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే సమాచారం ఆధారంగా రూపొందించినది. News18 దీనితో ఏకీభవించట్లేదు. News18 దీనికి బాధ్యత వహించదు
More
Stories
రాత్రివేళ అరటిపండు తింటే ఏమవుతుంది?
కరివేపాకుల్ని నమలకుండా తింటున్నారా?
టమాట సూప్ తయారీ