యూట్యూబ్ వాడేవారికి బిగ్ షాక్..

యూట్యూబ్ తన వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. 

యూట్యూబ్ తన ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలు తాజాగా పెంచింది. 

యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు ఎలాంటి యాడ్ లేకుండా గతంలో తీసుకువచ్చిన ఈ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచింది.

వ్యక్తిగత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌‌కు గతంలో నెలకు రూ.129 ఉండగా, ఇప్పుడు అది రూ.149 కి పెరిగింది.

స్టూడెంట్ ప్లాన్ ధర రూ.79 కాగా, దీనిని రూ.89 కి పెంచారు. 

ఫ్యామిలీ నెలవారీ ప్లాన్ ధరను మాత్రం 58 శాతం పెంచింది యూట్యూబ్. గతంలో దీని ధర రూ.189, కాగా, ఇప్పుడు అది రూ. 299 అయింది. 

దీంతో పాటుగా యూట్యూబ్ నెలకు వ్యక్తిగత ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.159కి చేరింది. 

ఇంతకుముందు ఇది రూ.139గా ఉండేది. తాజాగా దీనిపై రూ.20లను పెంచింది.

వ్యక్తిగత ప్రీపెయిడ్ త్రైమాసిక ప్లాన్ ధర రూ. 399 నుండి రూ. 459కి పెరిగింది. 

అదే వార్షిక ప్లాన్ ధర రూ. 1,290 నుండి రూ. 1,490కి పెరిగింది.

యూట్యూబ్ తన వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.